పిడుగుపాటుకు పాడిగేదె మృతి
రైతుకు బారి నష్టం వాటిల్లింది
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం జనగామ జిల్లా, బచ్చన్నపేట మండల కేంద్రంలో సదాశివపేట రోడ్డుకు రైతు చిట్టి రామచంద్ర రెడ్డి వ్యవసాయ పొలం వద్ద కట్టేసి ఉన్న పాడిగేదపై పిడుగు పడడంతో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. రాత్రి కట్టేసి ఉన్న గేదె ప్రొద్దున చూసేసరికి మృతి చెందడంతో రైతు కన్నీటిపర్యం అయ్యాడు. సుడితో ఉన్న పాడి గేదే మృతి చెందడంతో రైతుకు సుమారు లక్ష ఇరవై వేల రూపాయల భారీ నష్టం వాటిలిందని ప్రభుత్వం,దాతలు ఆదుకోవాలని రైతు చిట్టి రామచంద్ర రెడ్డి వేడుకున్నారు.