నెట్ బాల్ నేషనల్ గేమ్స్ (ఇండియన్ ఒలంపిక్స్) లో సిల్వర్ మెడల్ సాధించిన సెయింట్ జోసెఫ్ హై స్కూల్ క్రీడాకారులు
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి) షేక్ షాకీర్: నాగార్జున సాగర్ నియోజక వర్గం :ఫిబ్రవరి:20
ఉత్తరాఖండ్ లో ఈనెల 3 వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరిగిన నెట్ బాల్ 38వ నేషనల్ గేమ్స్ (ఇండియన్ ఒలంపిక్స్) లో నాగార్జున సాగర్ సెయింట్ జోసెఫ్ హై స్కూల్ విద్యార్థులు అయినటువంటి జె సుప్లవి రాజ్,ఎస్కే రిజ్వాన తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి సిల్వర్ మెడల్స్ సాధించారని నల్లగొండ జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ కిరణ్ కుమార్ తెలిపారు, నేషనల్ గేమ్స్ ఇండియన్ ఒలంపిక్స్ లో మెడల్స్ సాధించిన విద్యార్థులను సెయింట్ జోసెఫ్ హై స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ లలిత సిస్టర్ మతీన పాఠశాల పిఈటి కిరణ్ కుమార్ ఉపాధ్యాయ బృందం అభినందించారు