కాంగ్రెస్ పాలనలో మార్పు రాలే బతుకులు మారాలే
మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు గుండ విజయ రామారావు.
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా ,బచ్చన్నపేట మండలం, దబ్బగుంటపల్లి గ్రామం రాష్ట్ర బిజెపి పార్టీ చేపడుతున్న మహా సంపర్క్ అభియాన్ లో భాగంగా జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ఆధ్వర్యంలో బచ్చన్నపేట మండలంలోని దబ్బ గుంటపల్లి గ్రామంలో మండల అధ్యక్షులు బంగారు మహేష్ అధ్యక్షతన ఇంటింటికి బిజెపి ప్రతి ఇంటికి పోలింగ్ బూత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ పార్లమెంటు మరియు మాజీ మంత్రివర్యులు గుండె విజయ రామారావు హాజరై వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలలో మార్పు పేరుతో తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేసిందని అన్నారు. అలాగే పోయిన టిఆర్ఎస్ 10 సంవత్సరాల అరాచక పాలనను కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగింపుగా సాగిస్తుందని అన్నారు. నెరవేర్చని హామీలు, అసమర్ధ పాలన, అస్తవ్యస్త ఆర్థిక విధానాలు మరియు, అన్నగరి వర్గాల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇండ్లు ఇవ్వడం దారుణమని అన్నారు. అలాగే 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. నరేంద్ర మోడీ తీసుకొస్తున్న ప్రతి పథకాన్ని గడపగడపన వెళ్లి ప్రచారం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శేశిదర్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి సద్ది సోమిరెడ్డి, జిల్లా నాయకులు పరమేశ్వర్ రెడ్డి, ఉమరని నవిన్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శులు గద్దరాజు, జలంధర్, ఉపాధ్యక్షుడు చక్రపాణి, రమేష్ మరియు దబ్బ గుంటపల్లి బూత్ అధ్యక్షులు కనక రెడ్డి, మరియు నాయకులు పరమేశ్వర్ రెడ్డి, రమేష్,నవీన్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.