అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన టిఆర్ఎస్ పార్టీ నాయకుల ముందస్తు అరెస్టు
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి)నాగార్జున సాగర్ నియోజక వర్గం: మార్చి:12
అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన టిఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టుచేసి నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్లో బైండోవర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ హీరే కార్ రమేష్ జి మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు ఎవరు మాట్లాడిన పోలీసులకు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయిస్తుందని మండిపడ్డారు మీరు ఎంతమందికి అరెస్టులుచేసినా రాబోయే రోజుల్లోబీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రమేష్ జి తో పాటు మాజీ ప్రధాన కార్యదర్శి సభావాత్ చంద్రమౌళినాయక్ మాజీ పట్టణ అధ్యక్షులు సల్లోజు శేఖరా చారి మాజీ పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు పిట్ట సైదులు తదితరులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు