నవత ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మహిళలకు సన్మానం
ప్రజా గొంతుక నెక్కొండ ప్రతినిధి
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గ్రామపంచాయతీ పారిశుధ్య సిబ్బంది మహిళలను నవత ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి చేతుల మీదుగా శాలువాతో ఘనంగా సన్మానించారు మండల నవత ఆటో యూనియన్ అధ్యక్షులు మోడెం సురేష్
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మండల కేంద్రం లోని స్థానిక విశ్రాంతి భవనంలో నెక్కొండ మేజర్ గ్రామపంచాయతీ మహిళా పారిశుద్ధ్య సిబ్బందిని నవత ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు
ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ చైర్మన్ కొమ్మరెడ్డి సుధాకర్ రెడ్డి , సుబ్బారెడ్డి , మార్కెట్ డైరక్టర్ మైపాల్ రెడ్డి , నవత ఆటో యూనియన్ సీనియర్ డ్రైవర్ శ్రీరంగం శ్రీనివాస్, దీక్షకుంట్ల అధ్యక్షులు వడ్లకొండ శ్రీనివాస్, చండ్రుగొండ అధ్యక్షులు చిలువేరు కొమ్మాలు, పెద్దకార్పోల్ అధ్యక్షులు మహేష్, అమీనాబాద్ రవి, మండల నవత ఆటో యూనియన్ సబ్యులు పెండ్యాల రాజు, అమీర్, రామచందర్, జితేందర్, ప్రభాకర్, అంతయ్య, సౌరపు దేవేందర్, సూరిపల్లి రమేష్, తదితరులు పాల్గొన్నారు