పుల్వామా దాడిలో అమరులైన సైనికులకు ఘన నివాళులు.
.ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గురుదేవ్ విద్యాలయము ఫిబ్రవరి 14న పుల్వామా దాడి లో అమరులైన మన సైనికుల త్యాగాలను తలచుకుంటూ వారికి , విద్యార్థినీ విద్యార్థులు. ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు పుష్పాంజలితో ఘన నివాళులు అర్పించారు.
2019 ఫిబ్రవరి 14న జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథి పురా(అవంతిపురం సమీపంలో) కారుతో ఆత్మహుతి దాడి జరిగింది.
ఈ దాడి కారణంగా 40 మంది (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ) సి ఆర్ పి ఎఫ్ సైనికులు మరణించిన రోజు
కావున ఈరోజు గురుదేవ్ విద్యాలయంలో జాతీయ పతాకానికి సెల్యూట్ చేసి అమరులకు ఘనంగా నివాళులు అర్పించారు.