గ్రామాల,పట్టణాల అభివృద్ధితోనే దేశ పురోగతి – ఎంపీ డీకే అరుణ
షాద్‌నగర్ మున్సిపల్ 10వ వార్డులో రూ.27.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మన సాక్షి గొంతుక / షాద్‌నగర్
అమృత్ 2.0 అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా, షాద్‌నగర్ మున్సిపల్ 10వ వార్డులో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.27.50 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు ఎంపీ శ్రీమతి డీకే అరుణ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు ఎంపీకి ఘన స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రధాన అభివృద్ధి పనులు..మౌలిక సదుపాయాల అభివృద్ధి,ప్రధాన రహదారుల,విస్తరణ,మరమ్మతులు,మురుగు నీటి కాల్వల నిర్మాణం, తాగునీటి సరఫరా వ్యవస్థ అభివృద్ధిఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ,”గ్రామాల, పట్టణాల అభివృద్ధితోనే దేశం పురోగమిస్తుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేయడానికి కృషి చేస్తాము” అని తెలిపారు.కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు.బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య, నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి,ఎస్సి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యెంకనోళ్ల వెంకటేష్,స్థానిక నాయకులు, మున్సిపల్ అధికారులు, బీజేపీ కార్యకర్తలు, ప్రజలు,ఈ అభివృద్ధి పనుల ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని బీజేపీ నేతలు తెలిపారు.