కొమురవెల్లి దేవస్థానానికి లక్షా నూట పదహారు రూపాయలు విరాళం అందించిన అముర వేణు…
దైవభక్తి చాటుకున్న అముర వేణు
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం, తమ్మడపల్లి గ్రామానికి చెందిన సామాజికవేత్త , యువ నాయకుడు అముర వేణు దైవ భక్తి చాటుకున్నారు.అముర వేణు వారి కుటుంబం తో కలిసి శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకొని స్వామి వారి సేవ లో లక్షా నూట పదహారు రూపాయలు విరాళం గా సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుకున్న మొక్కులు తీర్చే కొమురవెల్లి మల్లన్న గుడి కి దైవభక్తితో లక్ష రూపాయలు విరాళంగా అందించడం సంతోషంగా ఉందని తెలియజేశారు. తన వంతు సాయంగా గ్రామంలో, మండలంలో ప్రజలకు సేవ చేయడం సంతోషంగా ఉందని రానున్న రోజుల్లో దైవం కల్పించిన దానిలో తన వంతుగా ప్రజలకు ఎంతో సహాయపడతానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోతల్లిదండ్రులు అమురా రాజయ్య అనసూయ, ఇవోఅన్నపూర్ణ, బుద్ది శ్రీనివాస్,ప్రధాన అర్చకులు మల్లికార్జున్ , యువ నాయకుడు పద్మ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.