కొత్తపల్లి స్కూల్ పరిధిలో స్కూల్ జోన్ బోర్డ్స్ ,స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయించాలని సి ఐ సతీశ్ రెడ్డికి వినతిపత్రం
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి )షేక్ షాకీర్: నల్లగొండ జిల్లా బ్యూరో: జూన్: 23
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల మండలం కొత్తపల్లి పాఠశాల రోడ్డు పక్కనే ఉండడం వలన, ఇక్కడ ఎటువంటి స్కూలుజోన్ బోర్డ్స్ గానీ, స్పీడ్ బ్రేకర్స్ గానీ,స్టాప్, గో స్లో, సైన్ బోర్డ్స్ గానీ లేకపోవడం వలన ఎక్కువ ప్రమాదాలకు ఆస్కారం ఉంది. కాబట్టి పాఠశాలకు వచ్చే విద్యార్థులు నిర్భయంగా బడికి రావడానికి అవసరమైన రోడ్డు భద్రతా చర్యలు తీస్కొని బడి అభివృద్ధి కి సహకరించాలని కోరుతూ మనవీ పత్రం ఇవ్వడం మరియు సతీష్ రెడ్డి నూతనంగా సి ఐ గా బాధ్యతలు చేపట్టినందుకు పచ్చని కానుకతో శుభాకాంక్షలు తెలపడం జరిగింది.