షాద్ నగర్ నియోజకవర్గానికి ప్రత్యేక వరం – గురుకుల పాఠశాల నిర్మాణానికి రూ. 200 కోట్లు
**విద్యకు చేయూతనిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కి వందనం!**
– **శ్రీమతి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి**, స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు మరియు రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్
ప్రజా గొంతుక /రంగారెడ్డి జిల్లా బ్యూరో
తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు యంగ్ ఇండియా గురుకుల పాఠశాలలకు రూ. 11,000 కోట్లు కేటాయించడం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం అని తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి, అభినందించారు.షాద్ నగర్ నియోజకవర్గంలో యంగ్ ఇండియా గురుకుల పాఠశాల నిర్మాణానికి రూ. 200 కోట్లు కేటాయించడం హర్షనీయం అని ఆమె పేర్కొన్నారు.అత్యాధునిక సదుపాయాలతో ఈ గురుకుల పాఠశాలలు నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంలో కీలకపాత్ర పోషిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, విద్యాభివృద్ధి కోసం చూపుతున్న అంకితభావం ప్రశంసనీయం అని తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి, పేర్కొన్నారు.”ఈ నిర్ణయం ద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులు కూడా మంచి చదువు పొందే అవకాశం పొందుతారు. విద్యా రంగంలో ఈ మార్పు తెలంగాణ రాష్ట్రానికి గొప్ప గుర్తింపును తీసుకొస్తుంది” అని ఆమె తెలిపారు.