శ్రీ శివరామకృష్ణ దేవతామూర్తుల యంత్ర ప్రతిష్ట మహా కుంభాభిషేకం
*పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్క వేణుగోపాల్*
ప్రజా గొంతుక /రాజేంద్ర నగర్
రాజేంద్రనగర్ నియోజకవర్గం, బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ పరిధిలోని కిస్మాత్‌పూర్ గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ శ్రీ శివరామకృష్ణ దేవతామూర్తుల యంత్ర ప్రతిష్ట మహా కుంభాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్క వేణుగోపాల్,పాల్గొని శ్రీ సీతా సమేత శ్రీరామచంద్రస్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ పూజారులు, భక్తులు వేణుగోపాల్ కి పూర్ణకుంభంతో సత్కారం అందజేశారు.ఈ మహోత్సవంలో బీజేపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శాంతి, సుభిక్షత, భక్తి మార్గంలో సమాజం పురోగమించాలని వేణుగోపాల్,ఆకాంక్షించారు.