సమగ్ర కుటుంబ. కుల సర్వే లో పాల్గొనని వారికి ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్.
16.తేదీ నుండి 28.వరకు
ప్రజాగొంతుక వెబ్ న్యూస్ కామారెడ్డి.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో ఇటీవల పాల్గొనని కుటుంబాల వివరాలు ఈ నెల 16 నుండి 28 వరకు నమోదు చేసుకోవచ్చునని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల నిర్వహించిన సర్వే లో నమోదు చేసుకొనని కుటుంబాల వివరాలు ఎంట్రీ చేసుకునే విధంగా ప్రభుత్వం మరొక అవకాశం కల్పించిందని తెలిపారు. సర్వే కు సంబంధించిన కుటుంబ వివరాలు నమోదు చేసుకునేందుకు మండల అభివృద్ధి అధికారి కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రజా పాలన సేవా కేంద్రాల్లో నిర్ణీత పొఫార్మాలో పూర్తి వివరాలు నమోదు చేసుకోవచ్చును. లేదా ప్రభుత్వం ఇట్టి విషయంలో ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ నెంబర్ 040- 21111111 నకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వివరాలు తెలియజేయవచ్ఛని,
లేదా ప్రభుత్వ వెబ్ సైట్ http:// seeepcsurvey.cgg.gov.in
నుండి దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకొని పూర్తి వివరాలు నమోదు చేసి ప్రజాపాలన సేవా కేంద్రంలో అందించవచ్చని ఆ ప్రకటనలో.తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.