వ్యవసాయ సర్వీస్ కనెక్షన్లను మంజూరు…
సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ కె.మాధవరావు
ప్రజా గొంతుక పెద్దపల్లి ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకైన రైతులకు ప్రత్యేక కార్యాచరణ అవలంభిస్తూ యుద్ద ప్రాతిపదికన వ్యవసాయ సర్వీస్ కనెక్షన్లను మంజూరు చేస్తున్నామని పెద్దపల్లి సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ కె.మాధవరావు తెలిపారు. సర్కిల్ పరిధిలో 2024 వరకు 72800 వ్యవసాయ సర్వీస్ కనెక్షన్లను ఉన్నాయని, కొత్తగా 2024 సంవత్సరనికి, 2025 ఫిబ్రవరి వరకు 1048 సర్వీసులను మంజూరు చేశామని మొత్తంగా 73800 సర్వీసులు ఉన్నాయని వివరించారు.2023 సంవత్సరం తో పోల్చుకుంటే దాదాపు 6% శాతం పెరిగిందని అన్నారు. వ్యవసాయ సర్వీసుల మంజూరుకు తీసుకోవాల్సిన అన్ని సత్వర చర్యలు తీసుకుంటూ త్వరితగతిన రిలీజ్ చేస్తున్నామన్నారు.ఇందులో భాగంగా సరిపడా మెటీరియల్ ( పోల్ లు కండక్టర్లు ట్రాన్స్ఫార్మర్లు )అంత సిద్ధం చేసుకున్నామని , పంట కోతలు కాగానే ఏప్రిల్, మే, జూన్ నెలలో వ్యవసాయ సర్వీసుల మంజూరు వేగవంతం చేస్తామని తెలిపారు,రైతుల పట్ల నిబ్బద్దత వారి శ్రేయస్సు కోరుకుంటూ వారికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అధిక ప్రాధాన్యత ఇస్తూ మంజూరు విషయంలో పెద్ద పీట వేస్తున్నామని ఈ సందర్బంగా వివరించారు. వ్యవసాయ సర్వీసుల మంజూరు ప్రక్రియ మొత్తం ఆన్ లైన్ ద్వారా చేపట్టడం జరిగిందని డిపార్ట్మెంట్ పరంగా దరఖాస్తు ఎక్కడ పెండింగ్ ఉన్నది తెలుసుకునే వెసులు బాటు ఎవరి దగ్గర పెండింగ్ ఉన్నది దానికి గల కారణాలను అధికారులు సవివరంగా అగ్రికల్చర్ పోర్టల్ ( ఆన్ లైన్ )లో చూసుకునే వెసులు బాటు కల్పించామన్నారు, తద్వారా మంజూరు లో ఆలస్యం లేకుండా వేగంగా పారదర్శకంగా మంజూరు చేస్తున్నామని అన్నారు,
అలాగే ఈ -స్టోర్స్ విధానం ప్రవేశపెట్టడం ద్వారా కావాల్సిన మెటీరియల్ ను ఆన్ లైన్ ద్వారా రిజర్వ్ చేసుకొని మెటీరియల్ ను కావాల్సిన సమయంలో తీసుకొని పనులు ప్రారంభించడం వలన వెంటనే మంజూరుకు ఎంతగానో దోహద పడుతుందని తెలిపారు,పేపర్ పని లేకుండా ఆన్ లైన్ ద్వారా మెటీరియల్ తీసుకునే సౌలభ్యం విద్యుత్ శాఖకు రైతులకు ఎంతో మేలు చేకురుతుందని చెప్పారు.ఈ పద్ధతి వలన క్షేత్ర స్థాయిలో పనిచేసే విద్యుత్ అధికారులకు ఎంతగానో సమయం ఆదా అవుతుందని వివరించారు. రైతులకు వ్యవసాయ సర్వీసుల మంజూరుకు అన్ని ఏర్పాట్లు చేసుకొని వెనువెంటనే మంజూరు చేసేందుకు ఆహర్నిశలు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు . వ్యవసాయ బోరులకు బావులకు కరెంట్ కావలసిన వారు మీ పొలం తాలూకా రిజిస్టర్ నకలు కాఫీ, విలేజ్ అసిస్టెంట్ సర్టిఫికెట్ లను తీసుకొని మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళి, 5 హెచ్ పి మోటార్స్ కు అప్లై చెయ్యండి. అందరకు సాధ్యమైనంత తొందరగా కరెంట్ ఇస్తా మని ఎస్ ఈ తెలిపారు.