జిల్లా కేంద్రంలో తిరంగా యాత్ర.
హాజరైన మెదక్ జిల్లా పార్లమెంటు సభ్యులు మాధవనేని రాఘవ నందన్ రావు.
శివంపేట. ప్రజా గొంతుక న్యూస్,మే 21:
ఆపరేషన్ సింధూర్ తో భారత సైన్యం చూపెట్టిన పరాక్రమాన్ని, ధైర్య సాహసాలను కీర్తిస్తూ భారత సైనిక చర్య విజయానికి మద్దతుగా మెదక్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘తిరంగా యాత్ర’ కు ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ మాధవనేని రఘునందన్ రావు.ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్,రాష్ట్ర నాయకులు మురళి యాదవ్ , రఘువీరా రెడ్డి , జిల్లా నాయకులు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ మెంబర్ కొండల్ రావు , శివంపేట మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పెద్దపులి రవి , అశోక్ సాదుల , శంకర్ , సుధాకర్ , భాస్కర్ రెడ్డి మరియు శివంపేట మండల భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.