భూభారతి చట్టం ప్రజలకు చుట్టం
* చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి
ప్రజా గొంతుక న్యూస్/చౌటుప్పల్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన భూభారతి చట్టం పేద ప్రజలకు రైతులకు చుట్టంలాంటిదని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఆయన చౌటుప్పల్ మున్సిపాలిటీ లక్కారంలో జరిగిన భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడారు, భూభారతి చట్టంలో రైతులకు ప్రజలకు అనుగుణంగా అనేక సెక్షన్లకూడిన అంశాలు ఉన్నాయని ,ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైతులకు , ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు, రైతులందరూ ఈ సదస్సులను ఉపయోగించుకోవాలని కోరారు,ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ తహసిల్దార్ వీరాభాయ్,తాజా మాజీ కౌన్సిలర్ కొయ్యాడ సైదులు గౌడ్,ఆర్ఐ బాణాల రామ్ రెడ్డి,మాజీ సర్పంచ్ ఎర్ర ఉషమ్మ భుజంగం,వార్డు అధ్యక్షులు పాశం శ్రీనివాస్, లందగిరి యాదయ్య గుండబోయిన ఐలయ్య యాదవ్,గోపన బోయిన మహేష్ యాదవ్, ఎర్ర శంకర్ బద్రి బాలరాజ్, రైతులు రాచకొండ చిరంజీవి , గోపన్న బోయిన జంగయ్య,తదితరులు పాల్గొన్నారు,