బిజెపి పార్టీ బీసీ బిల్లుపై చిత్తశుద్ధిని నిరూపించుకోండి
ఢిల్లీకి కదిలిన కాంగ్రెస్ నాయకులు
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
తెలంగాణలో 42 % బీసీ రిజర్వేషన్ల సాధనకై, ఆగష్టు 5, 6, 7 తారీఖులల్లో జరుగుతున్న బీసీ ఉద్యమానికి ఢిల్లీకి జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు బచ్చన్నపేట మండల సీనియర్ నాయకులు ఇజ్జగిరి రాములు ఆధ్వర్యంలో బచ్చన్నపేట మండల ఉపాధ్యక్షులు మట్టి బాలరాజ్, ఆరేళ్ల భాస్కర్ ,నీల రమేష్ తరలి వెళ్లారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ కోసం కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాడుతుంది అని, బీసీ రిజర్వేషన్ అమలు చేయడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని అన్నారు. బిజెపి పార్టీ బీసీలపై తమచిత్తశుద్ధినినిరూపించుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేసి పేదల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని నిరూపించుకుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని హెచ్చరించారు.