మోటార్ల దొంగతనం కేసులో ముగ్గురు అరెస్ట్..
ప్రజా గొంతుక న్యూస్ గుర్రంపోడు..
గుర్రంపోడు మండలం చామలేడు గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తుల్ని వ్యవసాయ మోటార్లు, విద్యుత్ వైర్లు దొంగతనం చేసిన కేసులో పోలీసులు గురువారం రిమాండ్ చేశారు.ఎస్సై మదు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 10న విద్యుత్ మోటర్ పోయిందని చామలేడు గ్రామానికి చెందిన గుండెబోయిన యాదయ్య పిర్యాదు చేశారు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గురువారం మండలంలోని ఆరెగూడెం స్టేజి వద్ద వాహన తనిఖీలు చేపట్టగా అనుమానాస్పదంగా విద్యుత్ వైర్లతో కనిపించిన ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకొని విచారించగా దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నారు.వారు మండలంలోని చామలేడు గ్రామానికి చెందిన దోటి సైదులు, దోటి శంకర్,ధోటి అశోక్ గా గుర్తించారు.వారి నుండి 4 విద్యుత్ మోటార్లు, 80మీటర్ల విద్యుత్ వైర్లు రికవరి చేశారు.వాటి విలువ రూ.94800 గా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.కేసును ఛేదించిన ఎస్సై మదుని, సిబ్బందిని దేవరకొండ ఏఎస్పీ మౌనిక అభినందించారు.