Monday, July 7, 2025

ఇందిరమ్మ ఇండ్లలిస్టు ప్రకటించాలి….సీపీఎం

(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి )నల్లగొండ జిల్లా బ్యూరో:జూన్: 25

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం మండలంలోని,నిడమానూరు,సూరేపల్లి,వల్లబా పురం,ఎర్రబెల్లి, గ్రామాలలో మొదటి విడతలు ఎంపిక చేసిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల లిస్టును వెంటనే ప్రకటించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను

ప్రభుత్వాన్ని కోరారు. ఆయా గ్రామాలలో అర్హులను గుర్తించి ఆ లిస్టును జిల్లా అధికారులకు సకాలంలో చేరవేయడంలో ఆలస్యం కారణంగా మొదటి విడతలో మండలంలోని పై నాలుగు గ్రామాలలో లబ్ధిదారుల ఎంపిక లిస్టు రాలేదని వారన్నారు. ఎన్నో ఆశలతో లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడానికి ఎదురుచూస్తున్నారని, అధికారుల, స్థానిక అధికార పార్టీ నాయకుల నిర్లక్ష్యం సమన్వయ లోపం కారణంగా అర్హులైన నిరుపేదలు నష్టపోతున్నారని వారన్నారు. కోటి ఆశలతో ఇందిరమ్మ ఇండ్ల కోసం అర్హులు ఎదురుచూస్తున్నారని, ఎంపిక చేసిన లబ్ధిదారుల లిస్టును వెంటనే విడుదల చేసి మిగిలిన గ్రామాల మాదిరిగానే మండలంలోని ఆ నాలుగు గ్రామాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి అర్హులైన పేదలను ఆదుకోవాలని కోరుతూ బుధవారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవోకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆగిపోయిన నాలుగు గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లను ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని తిరిగి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి లబ్ధిదారుల పేర్లను ప్రకటించాలని కోరారు, ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఎంపిక చేయబడిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల కు బిల్లుల చెల్లింపులు ఎటువంటి ఇబ్బందులు గురికాకుండా చూడాలని, పైరవీలకు,అధికార పార్టీ నాయకులకు అవినీతి అక్రమాలకు చోటు లేకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకొలని, ఉన్నతా అధికారుల పర్యవేక్షణలో కొనసాగాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, ఒక ఇంట్లో మూడు నాలుగు కుటుంబాలు కాపురాలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కోరారు . ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కుంచెం శేఖర్, వింజమూరు శివ, ముత్యాల కేశవులు కొండేటి సైదులు, వింజమూరు పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp