సంక్షేమ పథకాలకు నిలయం కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంట వెలుగులు నింపడమే ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మట్టి బాలరాజు అన్నారు. ఈ సందర్భంగా జనగామలో డిసిసి అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాపరెడ్డి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పేదవారికి ఆనాడు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడం జరిగిందని నేడు సీఎం రేవంత్ రెడ్డి జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి ద్వారా జనగామ నియోజకవర్గంలో పేద ప్రజలకు ఇండ్లు మంజూరు అయ్యాయని వారికి ఈరోజు మంజూరైన పత్రాలు అందజేయడం జరిగిందని తెలియజేశారు. సంక్షేమ పథకాలకు నిలయం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. తమ్మడపల్లి గ్రామస్తులకు ఇందిరమ్మ ఇండ్లు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీఉపాధ్యక్షులు మట్టి బాలరాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ రెడ్డి,కొడవటూరు డైరెక్టర్ కాశిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఇందిరమ్మ కమిటీ మెంబర్ సానిక రాజు, మ్యాకల రమేష్ ,గోలకొండ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.