పిడుగుపాటుకు గురైన రైతులను పరామర్శించిన మార్కెట్ చైర్మన్
రైతులకు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పరామర్శ
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
పిడుగుపాటుకు గురైన బాధిత రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్లనాగుల శ్వేతా వెంకన్న అన్నారు. బచ్చన్నపేట మండలం అలింపూర్ గ్రామంలో పిడుగుపాటుకు గురై జనగామ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతులను పరామర్శించి, మనోధైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా వారికి బ్రెడ్, పండ్లు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షానికి పిడుగుపాటు కు గురైన రైతులను పరామర్శించడం జరిగిందని, వారిని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలియజేశారు. రైతులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని, వర్షం వచ్చే సమయంలో చెట్ల కింద నిలపడకుండా జాగ్రత్తలు వహించాలని కోరారు.మాజీ ఎంపీటీసీ ఎండి మసూద్, కర్ణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు