బీసీ రిజర్వేషన్ పై బీజేపీ తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి
రేవంత్ సర్కార్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం అభినందనీయం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగిటి విద్యనాథ్
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో బీసీలకు రాజకీయాల్లో, ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్ కలిస్తూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయమని,రాష్ట్ర క్యాబినెట్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం అభినందనీయమని బచ్చన్నపేట మండల సీనియర్ నాయకులు జంగిటి విద్యనాథ్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆదేశానుసారం వారు మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ బీసీల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేశారన్నారు. బీసీ రిజర్వేషన్‌పై బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి బిల్లు ఆమోదం పొందేందుకు కృషి చేసి బీసీలపై తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని నిరూపితమైందన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందన్నారు. బీసీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని స్పష్టం చేశారు.