కుక్కల దాడిలో 25 గొర్రెలు మృతి
–-బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి
–-కురుమ సంఘం యువ నాయకుడు దయాల శ్రీనివాస్
ప్రజా గొంతుక న్యూస్/పాలకుర్తి:
జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరులో దారుణం జరిగింది.గొర్రెల దొడ్డిపై కుక్కలు దాడి చేసి 25 గొర్రెలను చంపేశాయి.గ్రామానికి చెందిన జోగు అశోక్ ఇంటి వద్ద దొడ్డిలో ఉన్న గొర్రెలపై మంగళవారం తెల్లవారు జామున కుక్కులు దాడి చేశాయి.ఈ ఘటనలో 25 గొర్రెలు చనిపోయాయి.మరో ఐదు గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి.వీటి విలువ సుమారు రూ.5 లక్షల వరకు ఉంటుందని బాధితులు బోరుమంటున్నారు.అప్పులు చేసి జీవాలను పెంచుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సంఘటనపై కురుమ సంఘం యువ నాయకుడు దయాల శ్రీనివాస్ స్పందించారు.బాధిత గొర్రెల కాపరిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రభుత్వాలు మారినా గొర్రెల కాపరుల జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.గొర్రెలకు బీమా సౌకర్యం కల్పించడంలో అధికారులు, ప్రభుత్వం విఫలం అవుతున్నారని విమర్శించారు.ఇప్పటికైనా ప్రభుత్వం గొర్రెల కాపరుల మీద ప్రత్యేక శ్రద్ద పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.సీజనల్ వ్యాధులు,కుక్కలు,తోడెళ్ల నుంచి గొర్రెలకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.