మండలం లో పోలింగ్ కేంద్రాలను 50 కి పెంచాలి
బి ఆర్ ఎస్ మండల కమిటీ డిమాండ్
ప్రజా గొంతుక న్యూస్ నర్సంపేట
నర్సంపేట రూరల్ మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ మాట్లాడుతూ 22 వేల జనాభాకు కేవలం 43 మాత్రమె పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారని దాని వలన అందరు ఓటు వినియోగించుకోవడం కోసం సమయం సరి పోవడం లేదని అన్నారు.ప్రభుత్వం ప్రజల సౌకర్యం కోసం పోలింగ్ కేంద్రాలను నర్సంపేట మండలం లో 50 కి పెంచాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహరములు,కొమల్ల గోపాల్ రెడ్డి,మోతే పద్మ నాభ రెడ్డి,మోటూరి రవి,కందుల రాజీ రెడ్డి,లకిడే రాజేశ్వర్ రావ్ తదితరులు పాల్గొన్నారు,