లబ్ధిదారులందరికీ ఇండ్ల స్థలాలు పంపిణీ చేయాలి
*సీపీఎం జిల్లా కార్యదర్శి—— తుమ్మల వీరారెడ్డి
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి) నాగార్జునసాగర్ నియోజక వర్గం: మార్చి:05
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలంలోని ముకుందాపురం గ్రామంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ప్రజా పోరులో భాగంగా ముకుందాపురం గ్రామంలో గతంలో ప్రభుత్వం పంచిన ఇళ్ల స్థలాలను పరిశీలించి లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. సర్వే నెంబర్ 840లో సుమారు 37 మందికి 75 గజాల చొప్పున 2023 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే హడావుడిగా ఇళ్ల స్థలాల కోసం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి లేఅవుట్ చేయకుండా, హద్దులను లబ్ధిదారులకు చూపించకుండా, హద్దురాల్లను పెట్టి లబ్ధిదారులకు ప్లాట్లను అప్పగించకుండా కేవలం పట్టా కాగితాలు పంచి చేతులు దులుపుకున్నారని ఆయన తెలిపారు. ఇండ్లు లేక,ఇండ్ల స్థలాలు లేక పేదలు గుడిసెలలో,కిరాయి ఇళ్లలో, ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఆయన అన్నారు. పేదల ఇండ్ల స్థలాల కోసం కేటాయించిన ఇదే స్థలంలో గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే ఒకపక్క లబ్ధిదారులకు ఇండస్థల కోసం పట్టాలిచ్చారు, మరోపక్క మైనార్టీ సోదరులు స్మశాన వాటిక కోసం గాతులు కొట్టారని, పేదల ఇండ్ల స్థలాల కోసం కేటాయించిన స్థలాన్ని పేదలకు ఇవ్వాలని కోరారు, ఎన్నికల కోసం ఓట్ల కోసం ప్రజలను మోసం చేసి నేడు పట్టించుకోవడంలేదని వెంటనే పట్టాలు ఇచ్చిన లబ్ధిదారులందరికీ లేఅవుట్లు చేసే ప్లాట్లు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే సమస్య అనేక గ్రామాలలో ఈ విధంగానే గతంలో జరిగిందని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని గ్రామాలలో ప్రజా సమస్యలపై సర్వేలు నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారానికి తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహిస్తామని ప్రజా సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు అందుబాటులో అండగా ఉంటామని ఆయన తెలిపారు. మండలంలో ఉన్న ఇళ్ల స్థలాల సమస్యలన్నింటినీ పరిశీలించి లబ్ధిదారులకు పట్టాలు ఇండస్థలాలు పంపిణీ చేయడంలో స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని పంపిణీ చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను, సిపిఎం మండల కార్యదర్శి కందుకూరి కోటేష్, సిపిఎం సీనియర్ నాయకులు కత్తిలింగారెడ్డి, మండల కమిటీ సభ్యులు కోమండ్ల గురువయ్య, నల్లబోతు సోమయ్య, మలికంటి చంద్రశేఖర్, ఫాలోజు సుదర్శన్, కుంచెం శేఖర్, రామరాజు యశోద, ఇళ్ల స్థలాల లబ్ధిదారులు ఉడుగుల సత్యవతి, షేక్ వలి, రంజాన్, వంగాల కృష్ణవేణి, రామ్ శోభారాణి, అలివేలు, రేణుక, కోటయ్య, మోబినా, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.