జులై 7 ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
*పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పిఎంఎస్ఎఫ్ కార్యకర్తల సమావేశం*
*ప్రజా గొంతుక ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్*)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత మన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈరోజు 13.6. 2025. రంగారెడ్డి జిల్లా మహేశ్వర మండల కేంద్రంలో రఘుపతి కాంప్లెక్స్లో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్ . అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ మహేశ్వర మండలం ఇన్చార్జి బక్కని రవి మాదిగ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల నూతన కమిటీల నిర్మాణం జెండా గజ్జల నిర్మాణం పూర్తిచేయడం జులై 7న ఎమ్మార్పీఎస్31 ఆవిర్భావ దినోత్సవాల వేడుకలు ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారుఅలాగే మన ఉద్యమానికి సహకరించిన గ్రామాల్లో ఉన్న అన్ని కుల పెద్దలను పార్టీల కతీతంగా ఆహ్వానించి సత్కరించడం చేయాలి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎమ్మార్పీఎస్ మహేశ్వర మండల అధ్యక్షులు ఎర్ర గణేష్ మాదిగ మాజీ అధ్యక్షులు జంగన్న మాదిగ శేఖర్ మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఎర్ర నవీన్ కుమార్ మాదిగ మండల ఉపాధ్యక్షులు మల్లేష్ మాదిగ ఎర్ర రాజు మాదిగ రాములు మాదిగ స్వర్ణ గంటి ఆకాష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు