ఒక్క రోడ్డు పదమూడు ముక్కలు
మద్దికుంట. ఇస్సన్నపల్లి గ్రామాల లింకు రోడ్డు
వచ్చేది మహాశివరాత్రి.
మద్దికుంట శ్రీ బుగ్గ రామ లింగేశ్వరా స్వామి. కళ్యణానికి
లెక్క లేని జనం వస్తారు.
ట్రాఫిక్ చాలా ఉంటది
పట్టించు కొని అధికారులు గ్రామస్తులు ఎన్ని సార్లు వేడుకున్న నిద్ర అవస్థలో అధికారులు
పడితే ప్రమాదం..
వాహనం అదుపు తప్పి పడితే పాడే మీదాకే అదృష్టం బాగుంటే ఇంటికి
ప్రజాగొంతుక వెబ్ న్యూస్
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామం ఇసన్న పల్లి గ్రామాల లింక్ రోడ్డు చెడిపోయి రెండు సంవత్సరాలనుండి చెడి పోయింది. మద్దికుంట గ్రామం లో వెలిసిన శ్రీ స్వయంబు బుగ్గ రామ లింగేశ్వర స్వామి ఆలయానికి అంతు పట్టని భక్తులు వస్తారు. వచ్చేది శివరాత్రి పండుగ శివకల్యాణనికి కామారెడ్డి జిల్లా నుండి కాకుండా పక్క జిల్లా ల నుండి మరియు పక్క రాష్ట్ర ల నుండి భక్తులు వస్తారు ఈ రోడ్డు ఇలా ఉంటే జనం ప్రయాణం ఎలా చేస్తారు. చేరాలిసిన గమ్యాన్ని ఎలా చేరుతారు. దయచేసి అధికారులు ఇప్పటికైనా స్పందించి పండుగ లోపు బాగు చేయాలనీ భక్తులు. మరియు గ్రామస్తులు వేడుకుంటున్నారు.