హలో ఆర్ఎంపి, పిఏంపి చలో హైదరాబాద్
డివిజన్ కార్యదర్శి కే భరత్ కుమార్
ప్రజా గొంతుక న్యూస్ నర్సంపేట
నర్సంపేట డివిజన్/ హలో గ్రామీణ వైద్యుడ చలో హైదరాబాద్ ఈనెల 18వ తారీకు
మంగళవారం రోజున
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సంఘాల ఉమ్మడి
గ్రామీణ వైద్యుల
బహిరంగ సభ కు ప్రతి గ్రామీణ వైద్యుడు
హాజరు కావాలని అనుభ వ వైద్యుల సంఘాల సమైక్య వరంగల్ జిల్లా అధ్యక్షులు అనుభవ వైద్యులసంఘాల రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ వెంకటనారాయణ పిలుపునిచ్చారు. దశాబ్దాల కాలం నుండి ఆర్ఎంపీల పీఎంపీల చట్టబద్ధత కోసం పోరాడుతున్న తరుణంలో దివంగత ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఒక జీవో No 429/1273
ఇచ్చినారు. వారి మరణానంతరం దశాబ్ద కాలం పాటు ఎలాంటి గుర్తింపు రాలేదు మరల 2024 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. మరలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కావున ఆ జీవో ప్రకారం గుర్తింపు ఇచ్చి గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని దానికి అనుగుణంగానే రేపు జరగబోయే ఆర్ఎంపీ, పిఏంపి ల బతుకు భరోసా బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ అధినాయకులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు దామోదర రాజనర్సింహ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మన సెలబస్ తయారుచేసిన జన విజ్ఞాన వేదిక ప్రొఫెసర్ బ్రహ్మ రెడ్డి జన విజ్ఞాన దర్శని అధ్యక్షులు రమేష్ రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాల నాయకులు, పాల్గొంటున్నారు గ్రామీణ వైద్య సోదరులు మన కోసం జరుగుతున్న ఈ సమావేశానికి మనం తప్పకుండా హాజరు కావాలని ప్రభుత్వానికి మన బలం చూపించాలని మనవి చేస్తూ ఎవరు ఎన్ని చెప్పినా ఈ మీటింగ్ కు వచ్చి ఈ బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో అనుభవైద్యుల
సంఘాల సమైక్య డివిజన్ కార్యదర్శి కే భరత్ కుమార్, కే వెంకటేశ్వర్లు,జిల్లా నాయకులు బి ధనుంజయ, జలగం రమేష్ నెక్కొండ మండల కార్యదర్శి
ఐలయ్య యాదగిరి సీనియర్ వైద్య సోదరులు సమ్మయ్య మదర్ పాక యాదగిరి కుడికాల సాంబయ్య ఎం వెంకన్న విజయ్ రాములు అశోక్, తదితరులు పాల్గొన్నారు