గంగమ్మ తల్లి జాతరలో పాల్గొన్న ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి )షేక్ షాకీర్: నాగార్జున సాగర్ నియోజక వర్గం: మార్చి:25
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం త్రిపురారం మండలం అల్వాల్ పాడ్ గ్రామస్తుల ఆహ్వానమేరకు గంగమ్మ తల్లి జాతర కార్యక్రమంలో ముఖ్య అతిధి గా పాల్గొని గ్రామస్థులతో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ యాదవుల ఆరాధ్య దైవం గంగమ్మ తల్లి అని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్దలతో పండుగ నిర్వహించుకోవాలని పాడి పంటలతో గ్రామస్తులు వృద్ది చెందాలని అభిలాషించారు.ఈ కార్యక్రమంలో త్రిపురారం మండల ఎం ఆర్ వో,గ్రామ యువ నాయకులు గుడిపాటి రాంబాబు యాదవ్, రావుల కోటి యాదవ్, సందీప్ యాదవ్,యం పీ టి సి కంటేస్ట్డ్ సైదా నాయక్,గుడిపాటి పెద్ద వెంకన్న యాదవ్, చిన్న మట్టయ్య యాదవ్, లక్ష్మణ్ నాయక్, రాజు యాదవ్, హేమంత్, సాయి, మన్నెం కోటి,రావుల రాము యాదవ్, శేఖర్ గౌడ్, గంగుల అంజి యాదవ్, లింగస్వామి యాదవ్, బోరిగొర్ల శ్రీను గ్రామ పెద్దలు మరియు యువత తదితరులు పాల్గొన్నారు