Wednesday, October 1, 2025

బెక్కెం గ్రామంలో బిపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం 

ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు దారాసింగ్

ప్రజా గొంతుక న్యూస్/చిన్నంబావి మండలం/ సెప్టెంబర్ 29

చిన్నంబావి మండల పరిధిలోని బెక్కెం గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ యువకులు ఐపీఎల్ తరహాలో నిర్వహిస్తున్న ( బీపీఎల్ ) క్రికెట్‌ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంటులో గ్రామంలోని ఏడు టీములు పాల్గొనడం జరిగింది. రాయల్ చాలెంజర్ కెప్టెన్ అన్నదాస్ రాజు, సూపర్ స్టార్ కెప్టెన్ సాయి, అంటార్స్ కెప్టెన్ రంజిత్, రైసింగ్ స్టార్స్ కెప్టెన్ రాము, క్యాపిటల్స్ కెప్టెన్ కిరణ్, దక్కన్ చార్జెస్ కెప్టెన్ వంశీ గౌడ్, స్ట్రీకర్ కెప్టెన్ సందీప్, టీములు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు ధారాసింగ్ హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు. క్రీడల వల్ల స్నేహసంబంధాలు పెరు గుతాయని, ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిపోయిన వారు నిరుత్సాహపడకుండా మళ్లీ గెలిచేందుకు కృషి చేయాలన్నారు. మరింత కృషి చేసి గెలుపు సాధించడానికి ప్రయత్నించాలని యువకులకు సూచించారు. అనంతరం దారాసింగ్ స్వయంగా క్రీడాకారులతో కలిసి క్రికెట్‌ ఆడారు. ఈ మ్యాచ్‌ను గ్రామ యువకులు యూట్యూబ్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. కార్యక్రమంలో చిన్నంబావి మండల అధ్యక్షుడు బొగ్గు కురుమయ్య, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు దేవని రమేష్ మాదిగ, వాల్మీకి మండల అధ్యక్షుడు ఉమేష్ నాయుడు, టీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు దేవుని వెంకటేష్ మాదిగ, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మందడి కృష్ణ, హోటల్ రాముడు, జె. శ్రీనివాసులు, బండారి కురుమూర్తి, డిఎన్ కృష్ణ, బిజెపి నాయకులు ఉగ్ర నరసింహ, తగరం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp