బృందావన్ టౌన్షిప్ లో సీసీ రోడ్డు పనులకు మునిసిపల్ అధికారులతో కలిసి ప్రారంభించిన యువ నాయకులు తోకల మురళీకృష్ణ
**పనిచేసే నాయకుడు ఉండడం మా అదృష్టం” – కాలనీవాసి శ్రీలం మాణిక్ ప్రభు**
ప్రజా గొంతుక/, రంగారెడ్డి జిల్లా బ్యూరో
శంషాబాద్ మున్సిపాలిటీలోని 8వ వార్డులోని బృందావన్ టౌన్షిప్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ తోకల విజయలక్ష్మి, యువ నాయకులు తోకల మురళీకృష్ణ ప్రముఖంగా పాల్గొన్నారు. తోకల మురళీకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ, 8వ వార్డులో సీసీ రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను 95 శాతం పూర్తి చేయడం జరిగినట్లు తెలిపారు. అతను ఈ పనులలో సహకరించిన ఎనిమిదో వార్డు ప్రజలు, ఓటర్లు, బృందావన్ టౌన్షిప్ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కాలనీవాసి శీలం మాణిక్ ప్రభు ఈ సందర్భంగా మాట్లాడుతూ, “పనిచేసే నాయకులు దొరకడం చాలా అదృష్టం. వారికి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తాము” అని తెలియజేశారు. ఈ పనులు ప్రాంత అభివృద్ధికి ప్రజల సౌకర్యాలకు దోహదపడుతుందని కాలనీవాసులు,అభిప్రాయపడ్డారు.ఈ పనులు ప్రారంభించడం ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి ప్రజల సౌకర్యాలకు మరింత మెరుగుదలలు సాధ్యమవుతాయని ఆశించవచ్చు.