మీ బాధ్యతగా పన్నులు చెల్లించండి – హాలియా అభివృద్ధికి తోడ్పడండి!
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి)షేక్ షాకీర్: హాలియా: ఫిబ్రవరి:25
హాలియా మున్సిపల్ కమిషనర్ ఆదేశానుసారం, హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అనుముల గ్రామం ఎస్సీ కాలనీలో ఇంటి పన్ను మరియు నల్లా పన్ను ఇంకా చెల్లించని వారికి రెడ్ నోటీసులు జారీ చేయబడినవి. ఈ కార్యక్రమంలో వార్డ్ అధికారి ఎండి ఖలీల్, బిల్ కలెక్టర్ బి. శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు.
మీ బాధ్యతగా పన్నులు చెల్లించండి హాలియా అభివృద్ధికి తోడ్పడండి!
పురపాలక అభివృద్ధి, శుభ్రత, తాగునీటి సరఫరా, రహదారుల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు వంటి పలు కార్యక్రమాలు ప్రజల నుండి వచ్చే పన్నుల ద్వారానే నిర్వహించబడుతున్నాయి. అందుకే, మీరు చెల్లించే ఇంటి పన్ను మరియు నీటి పన్ను హాలియా పురపాలక అభివృద్ధికి బలమైన అద్ధంగా నిలుస్తాయి.
అభివృద్ధిలో భాగస్వాములై, మీ నగరాన్ని మరింత మెరుగుపరచండి. పన్నులు చెల్లించండి హాలియా పురపాలక అభివృద్ధికి ఆ తోడ్పడండి!