తమిళనాడు లో బుల్లెట్ పై తిరుగుతున్నాడని దళితుని రెండు చేతుల నరికివేత
దళిత యువకుని చేతులు నరకడం దుర్మార్గపు చర్య
కులోన్మాధులను కఠినంగా శిక్షించాలి
10 కోట్ల పరిహారం అందించాలి.
కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి——- పాలడుగు నాగార్జున
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి) నల్లగొండ జిల్లా: ఫిబ్రవరి:14
తమిళనాడు రాష్ట్రం శివగంగా జిల్లాలో దళిత యువకుడు అయ్యస్వామి బుల్లెట్ బైకును కొనుగోలు చేసి నడుపుతుంటే జీర్ణీంచుకోలేని అగ్రవర్ణ ఆధిపత్య యువకులు పాశవికంగా ఆ యువకుని రెండు చేతులను నరకడాన్ని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా దళితులను ఇంకా మనుషులుగా చూడడం లేదని ఈ వివక్షతలను రూపుమాలపాల్సిన పాలకులే పెంచి పోషిస్తున్నారని పాలడగు నాగార్జున వారన్నారు.
ఈ దేశంలో మోడీ మతోన్మాదాన్ని తీవ్రంగా పెంచి పోషిస్తున్నాడని మోడి మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత దళితులపై దాడులు తీవ్రమయ్యాయని అన్నారు.మన్మధర్మ శాస్త్రం సూచించిన వర్ణ వ్యవస్థను అమలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు.ఉత్తర భారత దేశంలో దళితులపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి అన్నారు. అదేవిధమైన పరంపరను కొనసాగించడానికి దక్షిణ భారతదేశంలో బీజాలు వేస్తున్నారన్నారు. మతపరమైన దాడులపై స్పందించినంత వేగంగా కులోన్మాధ దాడులపై ఈ పాలకులు స్పందించడం లేదన్నారు.బుల్లెట్ బైక్ పై తిరిగి అర్హత ఈ దేశంలో దళితులకు లేదా అన్నారు.భారత రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు దళితులకు వర్తించవా అన్నారు.దళిత యువకుని చేతులు నరికిన ఆధిపత్య వర్గాల యువకులను ఫాస్ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి 45 రోజుల్లో కఠినమైన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు న్యాయవ్యవస్థ త్వరితగతిన శిక్షల విధించకపోవడంతోనే దళితులపై ఆధిపత్య కులాలు మరింత పెట్రేరేగిపోతున్నాయని వారన్నారు. సమసమానత్వాన్ని నెలకొల్పాల్సిన పాలకులు అసమానత్వలను సృష్టిస్తున్నారని ఆధునిక ప్రజాస్వామ్య సమాజంలో ఈ వివక్షతలు మంచిది కాదన్నారు.