మత్స్యశాఖ అధ్యక్షుడు గా పొన్నెబోయిన క్రాంతి కుమార్
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
నారాయణపురం గ్రామ మత్స్యశాఖ నూతన అధ్యక్షుడు గా పొన్నెబోయిన క్రాంతి కుమార్ ను నారాయణపురం గ్రామ మత్స్యశాఖ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వారిని శాలువలతో, సన్మానించి ,శుభాకాంక్షలు తెలియజేశారు.గ్రామంలో మత్స్య కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తానని నారాయణపురం గ్రామ మత్స్యశాఖ నూతన అధ్యక్షుడు పొన్నెబోయిన క్రాంతి కుమార్ అన్నారు .రైతుబంధు వలె మత్స్యకారులకు పథకాన్ని అమలు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను అర్హులైన మత్స్యకారులకు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. తనకు మద్దతు తెలిపిన మత్స్యకార సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొన్నెబోయిన సిద్ధుమల్లు,ఇండ్ల బుచ్చిరాములు,
పొన్నెబోయిన బాలయ్య,ఇండ్ల పెద్దరాములు,ఇండ్ల కృష్ణ,
పుచ్చులునర్సింహులు,పొన్నెబోయినభాస్కర్,పొన్నెబోయిన యాదగిరి,పొన్నెబోయిన రాజు,ఇండ్ల చిన్నరాములు,పొన్నెబోయిన చంటి, పొన్నెబోయిన బిక్షపతి,
పొన్నెబోయిన నర్సింహులు,ఇండ్ల సిద్దులు,పొన్నెబోయిన చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.