కృషి పట్టుదలతోనే ఈ విజయం…
గ్రూప్ 1 లో 467 మార్కులు మరియు గ్రూప్ 2 లో రాష్ట్ర 8 వ ర్యాంక్ వచ్చిన మిత్రునికి సన్మానం సత్కారం అభినందన
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట వాస్తవ్యులు బాల్య మిత్రుడు చిమ్ముల రాజశేఖర్ రెడ్డి కి గ్రూప్ 1 లో 467 మార్కులు మరియు గ్రూప్ 2 లో రాష్ట్ర 8 వ ర్యాంక్ వచ్చిన సందర్భంగా వారి మిత్రులు ఎమ్మార్పీఎస్ జనగామ జిల్లా అధ్యక్షులు పైస రాజశేఖర్ మాదిగ మండల మాజీ కో ఆప్షన్ మెంబర్ షబ్బీర్ అహ్మద్ మరియు ఎస్ఎస్ ప్లానర్స్ బచ్చన్నపేట ప్రోప్రయటర్ సద్దాం హుస్సేన్ లు సన్మానం చేసి సత్కరించి స్వీట్ పంచిఅభినందనలుతెలియజేయడం జరిగింది… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృషి పట్టుదల సాధించాలనే తపన ఉంటే ఏదైన సాధించవచ్చు అని నిరూపించిన వారు మా మిత్రుడు రాజశేఖర్ అని వారు అన్నారు…నిజంగా జీవితంలో అనేక కష్ట నష్టలకు తట్టుకొని అనుకున్నది సాధించడం కోసం తను పడిన తపన కోరిక నెరవేరిందని తనకి ఉద్యోగం రావడం మాకు మా గ్రామానికి జిల్లా కు గర్వకారణం అని వారు తెలిపారు.