Tuesday, July 8, 2025

యువత బాధ్యతాయుత జీవితానికి అడుగులు వేయాలి

*- మిషన్ పరివర్తన్ లో టూ టౌన్ పోలీసుల చైతన్య కార్యక్రమం*

(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి)షేక్ షాకీర్: నల్లగొండ జిల్లా బ్యూరో:జూన్: 23

నల్లగొండ, జూన్ 23, 2025 రోజున మిషన్ పరివర్తన్ కార్యక్రమం క్రింద నల్లగొండ టూ టౌన్ పోలీసులు విద్యార్థులలో మాదకద్రవ్యాలపై అవగాహన కల్పిస్తూ, పర్యావరణ పరిరక్షణపై చైతన్యం నింపే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. టూ టౌన్ పరిధిలోని అక్షర పాఠశాల మరియు రామగిరి ప్రభుత్వ బాయ్స్ హై స్కూల్‌లలో మొక్కలు నాటి, అనంతరం విద్యార్థులతో చర్చా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా టూ టౌన్ సీఐ రాఘవులు మాట్లాడుతూ ఇవాళ మత్తు పదార్థాలు మన యువతను మౌనంగా నాశనం చేస్తున్నాయి. విద్యార్థి దశలోనే సరైన మార్గనిర్దేశనం అవసరం. మీ జీవితాన్ని మద్యపానానికి కాదు, మానవతకు అంకితం చేయండి. ప్రతి మొక్కను నాటి రక్షించడం లాగే, మీ భవిష్యత్తుని కాపాడుకోవాలంటే మత్తు దురాచారాల నుంచి దూరంగా ఉండాలి అని చెప్పారు.

అదేవిధంగా ఎస్సై సైదులు , మాట్లాడుతూ మీరు మత్తులో మునిగిపోవాలనుకుంటే మీ కలలన్నీ కరిగిపోతాయి. మానసిక ధైర్యం, శారీరక ఆరోగ్యం మీరు చెరిపేసుకోవద్దు. విద్యార్థి దశను విలువైనదిగా మార్చుకునేందుకు మంచిని అనుసరించండి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై జైకర్,ఏఎస్ఐ శ్రీధర్, హెడ్ కానిస్టేబుళ్లు బాలకోటి, వెంకన్న, సతీష్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోలోజు నాగేంద్ర చారి పాఠశాల సిబ్బంది రామగిరి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు సామాజిక కార్యకర్త భీమనపల్లి శ్రీకాంత్, యలిజాల నరసింహ, పాఠశాలల యాజమాన్యం పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp