అంగరంగ వైభవంగా కనకదుర్గమ్మ ఆలయ ప్రతిష్టాపన
ప్రజా గొంతుక న్యూస్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల భక్తుల ఐదేళ్ల కల సాకారం. అయ్యింది.
ఆలయ కమిటి సభ్యులు మొక్కవోని దీక్షతో నిర్మాణం చేపట్టి పూర్తిచేసారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. చర్ల మండలంలో కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం ఆగమ శాస్త్రం ప్రకారం వేదమంత్రాల నడుమ విగ్రహ ప్రతిష్టాపన. ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. అనంతరం వేదపండితులు ఆద్వర్యంలో బుధవారం ఉదయం 11.12 నిముషాలకు వేలాదిమంది భక్తుల కోలాహలం నడుమ శ్రీ కనకదుర్గ రజత యంత్ర విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంతో పాటు నాలుగు ఉప ఆలయాలలో విగ్రహాలను ప్రతిష్టించారు ఆలయం ఎదురుగా 21అడుగుల భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసారు.అనంతరం మహా అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు .భక్తులు ఆలయ కమిటి సభ్యులు రెడ్డి శ్రీనివాసరావు, మండలోజు వీరాచారి, కేశంశెట్టి రవిచంద్రబాబు,రౌతు నరసింహారావు,చెరుకూరి సుబ్రహ్మణ్యం, తంగళ్ళపల్లి శంకరాచారి.కణితి నాగరాజు.దుర్గాప్రసాద్ భవాని పాల్గొన్నారు.ఈ సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయ కమిటి అద్యక్షుడు రెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంతటి మహత్ కార్యక్రమాన్ని
సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. తెలిపారు.