ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ ఇండ్లు…
గోపాల్ నగర్ గ్రామం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట
గోపాల్ నగర్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఘనపురం నాగేష్
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ డిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జనగామలో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల పత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇందులో గోపాల్ నగర్ గ్రామ శాఖ అధ్యక్షుడు గణపురం నాగేష్ ఆధ్వర్యంలో గోపాల్ నగర్ లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రతి పేదవారికి ఇల్లు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అది జనగామ టిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి తోనే సాధ్యమైందని అన్నారు. జనగామ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టాలను తీర్చే నాయకుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నారు. గోపాల్ నగర్ గ్రామం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని తెలియజేశారు. ఇంకా కొంతమందికి ఇల్లు రాలేదని ఎవరు బాధపడద్దని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతి పథకం నిరంతర ప్రక్రియ అని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో అనేక పథకాలు పార్టీ చెప్పిన విధంగా అమలు చేసిందని ఇంకా రానున్న రోజుల్లో అనేక పథకాలు పేద ప్రజల కోసం సీఎం రేవంత్ రెడ్డి జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి సారధ్యంలో అమలు అవుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పస్తం పోశయ్య, గంగర బోయిన మహేందర్, సోలా బాలరాజు, చింతల కర్ణాకర్, గంగారబోయిన ఐలయ్య, నీలనవీన్ ,నాగభూషణం, సిరిపాటి రామదాస్ తదితరులు పాల్గొన్నారు.