ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు వెళ్లిన ఇంట్లో చోరీ
కుంభమేళాకు వెళ్లిన ఇల్లు గుల్ల
కేసు నమోదు చేసిన స్థానిక ఎస్సై కిన్నెర రాజశేఖర్
ప్రజా గొంతుక ఫిబ్రవరి 17 అశ్వరావుపేట నియోజకవర్గం ప్రతినిధి
ములకలపల్లి మండలం లోని జగన్నాథపురం ప్రధాన సెంటర్లోని జయవరపు నరేష్ వరలక్ష్మి దుకాణంలో చోరీ జరిగినట్లు సమాచారం.సదరు వ్యాపారులు ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు వెళ్లిన క్రమంలో ఆ ఇంట్లో దొంగతనం జరిగినట్లు తెలిసింది.ఆగంతకులు ఇంటి వెనుక తలుపు గొళ్లెం పగులగొట్టి, ఇంట్లోకి ప్రవేశించి,బంగారంతోపాటు విలువైన వస్తువులు చోరీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. చోరీ విషయాన్ని గమనించిన బాధిత కుటుంబీకులు స్థానికుల సహాయం తో ప్రయాగ్ రాజ్ నుండి పోలీసులకు సమా చారం ఇవ్వగా వారు విచారణ చేపట్టారు.ఎస్ఐ కిన్నెర రాజశేఖర్ ను వివరణ కోరగా విచారణ చేపట్టామని తెలిపారు.దీనిపై బాధితుడు నరేష్ ను వివరణ కోరగా చోరీ జరిగింది నిజమే అని మేము ప్రయాగ్ రాజ్ నుండి వచ్చాక ఏమేమి దొంగతనం జరిగింది,వాటి విలువ ఎంత ఉంటుంది అనే విషయాలు వెలుగులోకి వస్తాయని ప్రస్తుతం ఇంటికి కాపలాగా తన అత్త మామలు ఉన్నట్టు వెల్లడించారు.