ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి )షేక్ షాకీర్: నాగార్జున సాగర్ నియోజక వర్గం: మార్చి:08
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ ఈ రే కార్ రమేష్ జి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమం మెయిన్ బజార్ మున్నా కాంప్లెక్స్ వద్ద ఘనంగా నిర్వహించారు సిద్ధార్థ హోటల్ మరియు ఇళ్లలో పనిచేయుచున్న హేమమ్మ 76 సంవత్సరాలు సామ్రాజ్యం 68 సంవత్సరాలు మరియు మున్సిపాలిటీ కార్మికులు రమావత్ కవిత పిట్ట మర్యాకుమారి అనురాధ లను శాలువాతో సత్కరించి వారికి స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా రమేష్ జి మాట్లాడుతూ మహిళలను గౌరవించుకునే బాధ్యత మన అందరి పైన ఉందన్నారు సమాజంలో మహిళలకు అన్ని కేటగిరీలలో రిజర్వేషన్లు పెంచాలని మహిళ లు అన్ని రంగాలలో ముందు వరుసలో ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సభావత్ చంద్రమౌళి నాయక్ ఆదాసు విక్రమ్ రిటైర్డ్ డిపిఓ రామ్మోహన్ రాజు మంజుల జనార్ధన్ మున్నాభాయ్ సిపిఐ పార్టీ వల్లపు నాగార్జున సైదారావు యోహాన్ రామస్వామి నక్క కిషోర్ పిట్ట సైదులు మురళి రాజు గాజుల రాము తదితరులు పాల్గొన్నారు