*రక్తానికి ప్రత్యామ్నాయ మార్గం లేదు…*
*రక్తదానం ప్రాణదానంతో సమానమే..*
*ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు..*
ప్రజాగొంతుక వెబ్ న్యూస్.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో కావ్య (28) గర్భస్రావం కావడంతో అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరమని డాక్టర్లు సూచించడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవా రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలున్న సంప్రదించడంతో వారికి కావలసిన రక్తాన్ని రాజంపేట రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ ప్రసాద్ సహకారంతో అందించడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్ లు మాట్లాడుతూ ప్రపంచంలో వైద్యరంగం ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఇప్పటివరకు కనుగొనలేకపోవడం జరిగిందని మానవత్వంతో ముందుకు వచ్చి సకాలంలో రక్తాన్ని అందజేసినప్పుడే ప్రాణాలను కాపాడగలుగుతామన్నారు. రక్తదానం చేసే రక్తదాతలకు గుండె జబ్బు క్యాన్సర్ కొలెస్ట్రాల్ సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేయడం జరిగిందన్నారు.రక్తదాత ప్రసాద్ కు జిల్లా రెడ్ క్రాస్ పక్షాన,ఐవిఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలియజేశారు.