సీఎం రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయ ఫలితమే ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ దళితుల కోసం దళితుల అభ్యున్నతి కోసం దళితుల సామాజిక న్యాయం కోసం పనిచేస్తుంది అని బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అల్వాల ఎల్లయ్య అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం 1955లో తీసుకువచ్చిన సివిల్ రైట్స్ యాక్ట్,భూ సంస్కరణల చట్టం,భూ సీలింగ్ చట్టం,ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం-1989,మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లాంటి చారిత్రాత్మకమైన నిర్ణయాలతో పాటు నేడు ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ,హేతుబద్ధీకరణ బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందడం అనేది చరిత్రలో నిలిచిపోయే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం అని తెలిపారు.సిఏం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రోజునే ఎస్సీ వర్గీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆనాడే ఎస్సీ వర్గీకరణ కోసం కార్యాచరణ ప్రకటించడం జరిగింది.సీఎం రేవంత్ రెడ్డి నిబద్ధత మరియు కమిట్మెంట్తోనే నిన్నటి రోజున ఎస్సీ వర్గీకరణ,హేతుబద్ధీకరణ బిల్లు-2025 రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందడం జరిగిందని తెలిపారు.ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి కి రాష్ట్ర మంత్రివర్గానికి ఎమ్మెల్యేలకు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ , జనగాం డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి లకుప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు.