అనుముల గ్రామంలో గణేష్ మండపం వద్ద విషాదం
విద్యుత్ వైరు తగలడంతో షాక్‌కు గురై బాలుడు అక్కడికక్కడే మృతి
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఆగస్టు:29
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల గ్రామం, కె.వి. కాలనీ లోని గణేష్ మండపంలో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది.
దండెం మణికంఠ (11 సంవత్సరాలు) విద్యుత్ వైరు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రజలకు సూచనలు:
మండపాలలో విద్యుత్ పనులు ఎలక్ట్రిషియన్ ద్వారానే చేయించాలి.
తెగిన,బహిర్గతమైన వైర్లు వాడకూడదు.
పిల్లలను విద్యుత్ పరికరాలకు దగ్గరికి అనుమతించవద్దు.
గణేష్ ఉత్సవాలను సురక్షితంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని హాలియా పోలీస్ వారు విజ్ఞప్తి చేస్తున్నాం