బిజెపి జిల్లా కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
ప్రజా గొంతుక ప్రతినిధి/జనగామ:
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బిజెపి జిల్లా కార్యాలయంలో బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలు కత్తుల లక్ష్మి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంకి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ విచ్చేసి వారు మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దక్కిందన్నారు.అదే విధంగా దేశ మొట్టమొదటి పౌరురాలు మహిళ అధ్యక్షురాలుగా ద్రౌపతి ముర్మ్ ని నియమించిన ఘనత,ఢిల్లీ ఎన్నికలలో మహిళా ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా నియామకం,గడిచిన 10 సంవత్సరాలలో మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు వారి ఆర్థిక స్థితిగతులను కాపాడే విధంగా వడ్డీ లేని రుణాలను మంజూరు చేసింది.స్వచ్ఛభారత్ పేరుతో ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించడం,ఉచితంగా మహిళలకు గ్యాస్ సిలిండర్ అందించిన ఘనత భారతీయ జనతా పార్టీ ది అని అన్నారు.ఈ సందర్బంగా మహిళలను ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా ఇంచార్జ్ మాలతిరెడ్డి,మాజీ కౌన్సిలర్ ఉడుగుల శ్రీలత,జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉమారాణి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉడుగుల రమేష్,మండల అధ్యక్షురాలు వెంకటలక్ష్మి,రజిత,శ్వేత,అశ్విని, హరిచంద్రగుప్త,దేవరాయి ఎల్లయ్య, అశోక్,నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.