రేపు(ఆదివారం)నీళ్ల కోసం చౌరస్తాలో మహాధర్నా….
సర్పంచుల పోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా, బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రధాన చౌరస్తాలో బచ్చన్నపేట మండలంలో చెరువులు ,కుంటలు కాంగ్రెస్ ప్రభుత్వం నింపాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు సర్పంచుల పోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్లు వారు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఒక్క ఎకరం పొలం కూడా ఎండకుండా నీటిని అందించి రైతన్న ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని నిరూపించుకుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల లోపే ఎక్కడికక్కడ పొలాలు ఎండిపోయి రైతన్నకు భారీ నష్టం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెరువులు కుంటలు నింపడంలో నిర్లక్ష్యం వహించిందని, అందుకే సుమారు 500 మంది రైతులతో బచ్చనపేట చౌరస్తా వద్ద మహ ధర్నా కార్యక్రమం రేపటి రోజు అనగా ఆదివారం చేపట్టనున్నట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ,రైతులు, రైతుల కుటుంబాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.