ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయం అందజేత
ప్రజా గొంతుక బచ్చన్నపేట ప్రభుత్వం
జనగామ జిల్లా, బచ్చన్నపేట మండల కేంద్రంలో నిరుపేద కుటుంబానికి చెందిన బొమ్మెళ్ల బాల నరసయ్య,సుజాత కూతురు వివాహానికి ఆర్థిక సహాయంగా 5000 రూపాయలు సామాజికవేత్త, కాంగ్రెస్ పార్టీ నాయకుడు జంగిటివిద్యనాథ్ అందించారు. ఆ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా కోడూరి మహాత్మాచారి, బాలకిషన్ గౌడ్, వేముల బాలరాజు, పిన్నింటి నారాయణరెడ్డి, గుర్రపు బాలరాజు, సిరిపాటి రామదాస్, దాచేపల్లి రాజయ్య, అవధూత శ్రీనివాస్, కూరాకుల రవి తదితరులు పాల్గొన్నారు.