ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందిన పేర్ల బాలు
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి )షేక్ షాకీర్: నాగార్జున సాగర్ నియోజక వర్గం: మార్చి:05
ఉస్మానియా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ విభాగంలో పేర్ల బాలు కు పీహెచ్డీ డాక్టరేట్ ప్రకటించినట్లు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రకటించారు, ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి మరియు ఐసిఎస్ఎస్ఆర్-ఎస్ ఆర్ సి డైరెక్టర్ ప్రొఫెసర్ బి. సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో, ప్రొఫెసర్ కె.అంజిరెడ్డి సూచనలతో ఫైనాన్స్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ స్టేట్ “ఏ కేస్ స్టడీ ఆఫ్ రియంబర్స్ మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు ఆఫ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ “అనే అంశంపై చేసిన పరిశోధనకు పిహెచ్డి డాక్టరేట్ అందుకున్నారు నల్గొండ జిల్లా అనుముల మండలం కుపాస్ పల్లి గ్రామం నుండి డాక్టర్ రేట్ పొందిన మొట్ట మొదటి విద్యార్థి అయినందుకు వారి కుటుంబ సభ్యులు మరియు గ్రామ ప్రజలు,సన్నిహితులు హర్షం వ్యక్తం చేశారు వారి యొక్క పరిశోధన సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.