ఇండ్లకు ముగ్గులు పోసిన ఎమ్మెల్యే
పేదోడి సొంతింటి కల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతోనే సహకారం అవుతుందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
ప్రజా గొంతుక న్యూస్ దుగ్గొండి
దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసి ముగ్గులు పోసిన గౌరవ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో మాట్లాడుతూ ఇల్లు లేని అర్హులైన ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రజలు ఎవరు ఆందోళన చెల్లకూడదని సూచించారు ఎస్సీ,ఎస్టీలకు ఇంటి నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు, బీసీ ఇతర సామాజిక వర్గాలకు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు