సతీష్ అన్న అంటే అందరికీ ధైర్యమే…
మూడు సంవత్సరాల క్రితం అప్లై చేసుకున్న సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించిన నాయకుడు గంగం సతీష్ రెడ్డి
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం, గోపాల్ నగర్ గ్రామంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సుమారు మూడు సంవత్సరాల క్రితం సీఎం రిలీఫ్ ఫండ్ కింద పిట్టల మహేశ్వరి కరుణాకర్ అప్లై చేసుకున్న ఫైల్ మంజూరు కాకుండా ప్రభుత్వం మారడంతో డబ్బులు రాకుండా ఈ నిరుపేద కుటుంబానికి ఇబ్బందులకు గురయ్యారని గోపాల్ నగర్ మాజీ సర్పంచ్ పర్వతం మధు ప్రసాద్ సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడంతో స్పందించి ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్రెడ్డి కి సమాచారం తెలియజేసి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు అయ్యేవిధంగా కృషిచేసి, ఆ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఇక డబ్బులు రావుఅనిబాధపడుతున్న సమయంలో మాజీ సర్పంచ్ మధు ప్రసాద్ , గంగం సతీష్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఒక లక్ష,28 వేల రూపాయలు మంజూరు చేయించినందుకు వారికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అందుకే సతీష్ అన్న అంటే మా అందరికీ ధైర్యం అని వారు అన్నారు.ఈ సందర్భంగా గోపాల్ నగర్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుర్రపు రమేష్, వద్ది వెంకటయ్య, పేరబోయిన పరశురాములు, బొమ్మన నర్సింలు, జనార్దన్ శ్రీకాంత్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.