నిరాశ్రయులైన కుటుంబానికి ఆర్థిక సహాయం
.ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాచర్ల మండలం లోని ఉంజుపల్లి గ్రామానికి చెందిన అక్కా తమ్ముడు ఇర్ప ముత్తయ్య బుల్లెమ్మ లకు చెందిన నివాసం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా కాలి బూడిదై, కట్టు బట్టలతో నిరాశ్రయులైన పరిస్థితి. వీరి కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు మీకోసం మేమున్నాం టీం తరఫున ఫండ్ రైజింగ్ పోస్టు పెట్టి సేకరించిన 6,000/- నగదును మరియు 7,000/- విలువ గల నిత్యావసర సరుకులు – వంట సామాగ్రి దుస్తులను కుంజా శ్రీను మరియు ఇర్ప అనసూయ టీచర్ చేతుల మీదుగా బాధితులకు అందించడం జరిగింది. బాధితుడైన ఇర్ప ముత్తయ్యకు రెండు నెలల క్రితం జరిగిన ఓ యాక్సిడెంట్లో కాలు ఫ్రాక్చర్ అయి, మంచానికి పరిమితమవ్వడం చాలా బాధాకరం.ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ పేదవారు కష్టాల్లో ఉన్నప్పుడు మనమంతా తలా ఓ చేయివేస్తే ఎంతటి క్లిష్టమైన సమస్యలనైనా అవలీలగా అధిగమించ గలుగుతారని, ఇదేవిధమైన సహకారం .అందిస్తూ సంస్థను ముందుకు తీసుకు రావాలని కోరారు. అలాగే వంట సామాగ్రి – దుస్తుల ను వ్యక్తిగతంగా స్పోన్సర్ చేసిన ఇర్ప అనసూయ టీచర్ కు ధన్యవాదములు తెలియజేసారు… ఈ కార్యక్రమంలో కొంగూరు నర్సింహారావు,దొడ్డ ప్రభుదాస్, బూహ్యవరపు ప్రతాప్, కొమరవరపు రవి, ఇర్ప ఉమ,ఇర్ప శ్రావణి, ఇర్ప అంజిబాబు, పూనెం వీరన్న తదితరులు పాల్గొన్నారు.