తెలంగాణ రియల్ హీరో రేవంత్ రెడ్డే….
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
నా తండ్రి నాకే కాదు తెలంగాణకే హీరో అని కెటిఆర్ మాట్లాడిన వాక్యాలు ఖండిస్తూ బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణకు కెసిఆర్ హీరో అని బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని కానీ తెలంగాణకు అసలైన హీరో సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు. కెసిఆర్ తన పదేళ్ల పాలనలో చేయలేని అనేక పనులు, సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అయ్యాక ఏడది కాలంలోనే చేసి చూపించారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కులగణన చేసి కులాల లెక్కలు తేల్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి ది అని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, నిరుద్యోగులకు 55వేల ఉద్యోగాలు, ఆరోగ్యశ్రీ కింద పది లక్షలు,ప్రజాభవన్ పెట్టి ప్రజావాణి కింద ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిష్కారం చేస్తున్నారన్నారు. ఇంకా అనేక పథకాలు సంక్షేమ పథకాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అందుకే తెలంగాణ రియల్ హీరో రేవంత్ రెడ్డి అని చెప్పారు.